హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తేతెలంగాణ): ‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టుపెట్టి రుణం పొందినట్టు.. అసెంబ్లీ సాక్షిగా మేం అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది? మరి ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం తాము తనఖా పెట్టుకోలేదని చెప్తున్నది.
ఇందులో ఏది వాస్తవం? అసలు ఈ భూములను ఎవరికి తాకట్టుపెట్టారు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బ్రోకర్ కంపెనీలకు తాకట్టు పెట్టారా? అని శనివారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ఇందులో దాగి ఉన్న చీకటి కోణం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.