కేసీఆర్ వల్లే ప్రగతిపథంలో తెలంగాణ
‘నాడు సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమ జెండా ఎత్తిన కేసీఆర్‌ని నిలబెట్టి గెలిపించింది సిద్దిపేట గడ్డ.. ఆనాడు మీరు కేసీఆర్‌ని గెలిపించడం వల్లే తెలంగాణ వచ్చింది, స్వరాష్ట్రం సిద్ధించడం వల్లే జిల్లా ఏర్పాటై ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. ఈ అభివృద్ధి అంతా సిద్దిపేట మట్టి గొప్పతనం, ప్రజల గొప్పతనం.. అందుకే ఈ పదేండ్ల ప్రగతి పండుగను సిద్దిపేట ప్రజలకే సగర్వంగా అంకితం చేస్తున్నాను. కేసీఆర్ ఆశీస్సులు.. ప్రజల దీవెనలతో ఈ స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నా.
- సిద్దిపేట ప్రజలు కేసీఆర్‌ను గెలిపించడం వల్లే తెలంగాణ.. జిల్లా సాకారం
- పదేండ్ల ప్రగతి పండుగ సిద్దిపేట ప్రజలకే అంకితం
- సిద్దిపేట దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘నాడు సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమ జెండా ఎత్తిన కేసీఆర్‌ని నిలబెట్టి గెలిపించింది సిద్దిపేట గడ్డ.. ఆనాడు మీరు కేసీఆర్‌ని గెలిపించడం వల్లే తెలంగాణ వచ్చింది, స్వరాష్ట్రం సిద్ధించడం వల్లే జిల్లా ఏర్పాటై ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. ఈ అభివృద్ధి అంతా సిద్దిపేట మట్టి గొప్పతనం, ప్రజల గొప్పతనం.. అందుకే ఈ పదేండ్ల ప్రగతి పండుగను సిద్దిపేట ప్రజలకే సగర్వంగా అంకితం చేస్తున్నాను. కేసీఆర్ ఆశీస్సులు.. ప్రజల దీవెనలతో ఈ స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నా.
చరిత్ర ఉన్నంతవరకు సిద్దిపేటలో చేసిన అభివృద్ధి పనులు నిలబడి ఉంటాయి. దేశంలో ఎకడికి వెళ్లినా సిద్దిపేట వాళ్లమంటే గౌరవం దకేలా అభివృద్ధి చేశాను’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం విపంచి కళానిలయంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, ఆయాచితం శ్రీధర్, జర్నలిస్టు నాయకుడు విరాహత్ అలీ, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితర నేతలతో కలిసి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిద్దిపేట సాహిత్య వైభవం, స్వరాష్ట్రంలో సాధించిన గుణాత్మక మార్పులు, భవిష్యత్తు ప్రణాళికలు వివరించారు.
అనంతరం వర్తక, వాణిజ్య, వ్యాపార, వైశ్య సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రైస్‌మిల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, రూబీ నెక్లెస్ రోడ్డు కోమటి చెరువు వద్ద ఫుడ్ ఫెస్టివల్‌తోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సిద్దిపేట మీదుగా ఉత్తర భారతానికి రైళ్లు నడవనున్నాయని చెప్పారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా దక్షిణ భారతానికి ప్రతి అరగంటకు ఒక రైలు నడుస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో రైస్ మిల్లులపై అధికారుల దాడులు జరుగలేదని గుర్తుచేశారు.
సిద్దిపేటకు ఒక ప్రత్యేకత
రాష్ట్రంలో లేదా దేశంలో అవార్డుల జాబితా ఉంటే అందులో సిద్దిపేట పేరు లేకుండా అవార్డే ఉండదని హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధి, హరితహారం, విద్య, వైద్యం, స్వచ్ఛతలోనే కాకుండా సాహిత్య రంగంలోనూ నంది పురసారం నుంచి జా తీయ సాహిత్య అకాడమీ వరకు సిద్దిపేటకు నిరంతరం అవార్డులు వస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో సిద్దిపేటలో కేవలం 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే పండేదని, నేడు గోదావరి జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని సాగు విస్తీర్ణం పెరిగి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నదని తెలిపారు.
ఆయిల్‌పామ్ పంట అంటే ఏంటో తెలియని ఈ ప్రాంతంలో నేడు విరివిగా ఆయిల్‌పామ్ తో టలు విస్తరించి రైతులు అధిక లాభాలు గడిస్తున్నారని వెల్లడించారు. విద్యారంగంలో రావాల్సినవి ఇంకా రెండే ఉన్నాయని, ఒకటి ఎల్ఎల్బీ కాలేజీ, మరొకటి యూనివర్సిటీ.. రాబో యే పదేండ్లల్లో ఈ రెండింటిని కూడా తప్పకుండా సాధించి తీరుతామని భరోసా ఇచ్చా రు. కవులు ఏ పుస్తకం రాసినా సరే, దాన్ని స్వయంగా అచ్చు వేయించి ప్రచురించే పూర్తి బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
నేడు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ
సిద్దిపేట జిల్లా పదేండ్ల పండుగను పురస్కరించుకొని డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు కృషి చేసి, జిల్లాను సాకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు గ్రామగ్రామాన, పట్టణంలోని అన్ని వార్డుల్లో క్షీరాభిషేకాలు నిర్వహించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

