హైదరాబాద్: రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేరు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళలకు భద్రత లేదని తేటతెల్లమయిందంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైంది. భద్రత కల్పించవలసిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 9 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. షీ టీమ్స్, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి భద్రత కల్పించింది. కానీ ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళా భద్రత లేదని తేటతెల్లమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలి. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైంది.
భద్రత కల్పించవలసిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది.
ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా… pic.twitter.com/QasGP3oIOL
— Harish Rao Thanneeru (@BRSHarish) October 4, 2024