ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామంటూ ముక్కోటి దేవతలపై ఒట్టు పెట్టి అబద్ధాలు ఆడారు. నాలుగు సంక్షేమ పథకాలను అమలుచేస్తామని చెప్పి,అత్యంత పవిత్రమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును అవమానపరిచారు.-హరీశ్‌రావు
Harish Rao | గజ్వేల్, జనవరి 26: పాలమూరును ఎవరు నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేసేందుకు పవర్ఫుల్ కురుమూర్తి దేవాలయానికి నువ్వు తడి బట్టలతో రా.. నేను కూడా వస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి బీఆర్ఎస్ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గ అభినందన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ హయంలో పాలమూరును మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను నీటిపారుదల శాఖ మంత్రిగా తాను రాత్రింబవళ్లు అక్కడే పడుకొని రూ.నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి 6.5 లక్షలసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ హయంలో పాలమూరును మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను నీటిపారుదల శాఖ మంత్రిగా తాను రాత్రింబవళ్లు అక్కడే పడుకొని రూ.నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి 6.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించామని, కేసీఆర్ హయాంలో జిల్లాకు కృష్ణా జలాలను పారించామని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాను ఎండబెట్టింది, అన్యాయం చేసింది కాంగ్రెస్, టీడీపీలేనని విమర్శించారు. సీఎంగా నోరు పెద్దగా చేసుకొని అబద్ధాలు మాట్లాడితే నిజం అవుతుందా? అని నిలదీశారు.
దరఖాస్తు లేకుండా రైతుబంధు ఇచ్చినం
రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి దరఖాస్తు తీసుకొకుండా 11 విడతల్లో 69.5 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చామని హరీశ్‌రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెద్దలకు తొలగించి అసలైన వారికే ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో 69.5 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి 70 లక్షల మంది ఎలా వచ్చారని నిలదీశారు. పేద ప్రజల ఉసురు తీస్తూ దరఖాస్తులు చేయించుకుంటున్నరని, బీఆర్ఎస్ హయాంలో 57 ఏండ్లకే పింఛన్లు ఇచ్చి చూపించామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్‌నే తలుచుకుంటున్నారని, కేసీఆర్‌లా పనిచేయడం ఆయనకు చేతకాదని దుయ్యబట్టారు. రేవంత్‌కు చేతకాకపోవడానికి పరాకాష్ట, అసమర్థతకు నిదర్శనం ఏడాదిలో ఒక్క పథకాన్ని కూడా అమలుచేయలేకపోవడమేనని మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా పథకం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మాలో, మంత్రి సీతక్క మాటలు నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొన్నదని ఎద్దేవా చేశారు. షరతులు, కోతలతో ప్రజా ప్రభుత్వం కూలీలను కూడా మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు.
డమ్మీ చెక్కులిచ్చిన సీఎం
మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు నవంబర్ 30న రూ.2,700 కోట్ల రుణమాఫీ డమ్మీ చెక్కును సీఎం రేవంత్ ఇచ్చారని, సీఎం ఇచ్చిన చెక్కు పాస్ కాకపోతే ఆయనకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదని, వెంటనే డమ్మీ చెక్కును పాస్ చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.21వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో 183 మందికే రుణమాఫీ అయిందని చెప్తుంటే, అందరికి అయిందని సీఎం చెప్తున్నారని దుయ్యబట్టారు. అబద్ధపు పునాదులపై అధికారంలోకి వచ్చి సీఎం కుర్చీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని చెప్పి, నేడు రూ.6 వేలు ఖాతాలో వేస్తున్నరని, ప్రతి రైతుకు ఎకరాకు రూ.9 వేలు బాకీ పడిందని వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నాయకులను రైతుబంధుపై నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కూలితే ప్రాజెక్టు కూలినట్టు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నుంచే మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నీళ్లు వచ్చాయని, వాటి నుంచే 20 టీఎంసీలు హైదరాబాద్‌కు, 5 టీఎంసీలు మూసీకి తీసుకుపోతామంటున్నారని చెప్పారు.
వందరోజులు ఎటుపోయాయి?
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలుచేస్తామని చెప్పి 400 రోజులైనా మహాలక్ష్మి, పేదలకు ఇండ్లు, పింఛన్లు, విద్యార్థులకు భరోసా ఇవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి మాటల మీద నమ్మకం లేక 400 రోజుల్లో 400 మంది రైతు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రైతులు ఉసురు తగులుతుందని చెప్పారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, భూపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేసీఆర్ పదేండ్ల కాలంలో ఒక్క దరఖాస్తు తీసుకోకుండా అర్హులకు సంక్షేమ పథకాలు అమలుచేశారు. ఇప్పుడు దరఖాస్తులే దరఖాస్తులు తప్ప ఒక్క పథకం అమలుకావడం లేదు. కేసీఆర్ 6.47 లక్షల మందికి రేషన్‌కార్డులు ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేశారు.
– హరీశ్‌రావు
ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామంటూ ముక్కోటి దేవతలపై ఒట్టు పెట్టి అబద్ధాలు ఆడారు. నాలుగు సంక్షేమ పథకాలను అమలుచేస్తామని చెప్పి, అత్యంత పవిత్రమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును అవమానపరిచారు.
– హరీశ్‌రావు