సంగారెడ్డి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): హోంగార్డులంటే ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు చులకనగా ఉందా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న సంగారెడ్డికి చెందిన హోంగార్డు గోపాల్‌ను మంగళవారం మాజీ మంత్రి హరీశ్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ పోలీస్టేషన్ హోంగార్డు గోపాల్.. ఇటీవల మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తుండగా శిథిలాలు తగిలి తీవ్రంగా గాయపడి చికి త్స పొందుతున్నారని తెలిపారు. గోపాల్‌ను ఒక్క ఉన్నతాధికారి కూడా పరామర్శించలేదని తెలిపారు. గోపాల్ కోలుకునే వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, 4 నెలల వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఇంకా మాజీ ఎమ్మెల్యేలు పెద్దరెడ్డి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.