Harish Rao : రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్ట్‌ల న్యాయమైన పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
‘జీవో 252 సవరణను డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న జర్నలిస్ట్‌లను అక్రమ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. స్తున్నాం. జర్నలిస్టులకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26,000 అక్రిడిటేషన్ కార్డు(Accreditation Card)లు ఇచ్చారు. రిపోర్టింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు అనే బేధం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారు కేసీఆర్. కానీ, రేవంత్ రెడ్డి అక్రిడిటేషన్ కార్డులను 10 వేలకు తగ్గిస్తామని చెప్పడం దుర్మార్గం. డెస్క్ జర్నలిస్ట్‌లకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం దారుణం. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని ఎమ్మెల్యే వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
జర్నలిస్టులకు కేసీఆర్ గారు 26,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు.
రిపోర్టింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు అనే… pic.twitter.com/T1VozwRGpQ— BRS Party (@BRSparty) December 27, 2025
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం డెస్క్ జర్నలిస్ట్‌లు ఆందోళన బాట పట్టారు. అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించిన తర్వాత కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేశారు.