హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): భావి భారత పరిరక్షకులను తయారు చేయడానికి సచ్చిదానంద స్వామి దత్తపీఠంతో పాటు ఎన్నో విద్యాలయాలను నడుపుతున్నారని, మానవ సేవే మాధవ సేవ అని నమ్మడమే కాకుండా ఆచరించి చూపించిన గొప్ప మహనీయులు సచ్చిదానంద స్వామి అని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. చేయిచేయి కలిస్తేనే సమాజ స్థాపన జరుగుతుందనే దత్తజీ బోధనలు మనందరికీ ఆదర్శమని తెలిపారు.
నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని లలిత కళాతోరణంలో శనివారం నిర్వహించిన దర్శనం పత్రి క ద్విదశాబ్ది మహోత్సవంలో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎలాం టి లాభపేక్ష లేకుండా సమాజహితం కోసం 20 ఏండ్లుగా దర్శనం దినపత్రిక నడుపుతున్న వెంకన్నను అభినందించారు.
నేటి డిజిటల్ యుగంలో ఆధ్యాత్మిక పత్రిక నడపడం చాలా కష్టతరమని, అయినా ఎలాంటి లాభాపేక్ష లే కుండా దర్శనం దినపత్రిక నడపడం అభినందనీయమని పేర్కొన్నారు. దశాబ్దం క్రితం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దర్శనం పత్రిక వార్షికోత్సవానికి వచ్చారంటేనే వెంకన్న కృషి గురించి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. వ్యా ధులను నయం చేసే గుణం సంగీతానికి ఉం దని చాటి చెప్పిన వ్యక్తి దత్తజీ అని తెలిపారు.