కోమ్: తమ అత్యున్నత అధినేత ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని చాటి చెప్తూ కోమ్‌లోని జమ్కరన్ మసీదుపై ఇరాన్ ఆదివారం ఎర్ర జెండా ఎగరేసింది. ఈ పతాకం న్యాయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఖమేనీ అనుచరులు, మద్దతుదారుల్లో పెల్లుబుకుతున్న ప్రతీకారానికి ఈ జెండా నిదర్శనంగా నిలుస్తుందని మీడియా కథనాలు వెలువడ్డాయి. మరోవైపు ఖమేనీ మృతిపై రాజధాని టెహ్రాన్‌లో కొందరు వీధుల్లోకి వచ్చి హర్షం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని నాశనం చేయడానికి ఖమేనీ ప్రణాళికలు రూపొందించాడని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.