Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య ఉన్న లవ్ ఏంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థమవ్వట్లేదు అని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగితే, రెండ్రోజుల్లో కేంద్ర సంస్థల్ని పిలిపించాడు. మరి.. ఎస్ఎల్బీసీ మొత్తానికే కూలిపోతే, ఎన్డీఎస్ఏకి కిషన్ రెడ్డి లేఖ ఎందుకు రాయలేదు? అని నిలదీశారు హరీశ్‌రావు.
కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బ తీసారు. ఆనాడు మేడిగడ్డలోని 85 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కుంగితే వెంటనే ఎన్డీఎస్ఏకు లేఖ రాసిండు కిషన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితే ఎందుకు మాట్లాడవు కిషన్ రెడ్డి, ఎందుకు ఎన్డీఎస్ఏకు లేఖ రాయవు. 5000 కోట్ల ప్రాజెక్టు ఆగం అయితే ఎందుకు మాట్లాడవు. కిషన్ రెడ్డి, రేవంత్ మద్య ఉన్న బంధం ఏమిటి..? పియ్యర్ కుంగితే ఎన్డీఎస్ఏ వచ్చింది, ప్రాజెక్టు కుంగితే ఎందుకు రారు. కృష్ణాలో గత పదేండ్లలో ఎప్పుడూ వాడనంత తక్కువ నీటిని 28శాతం వాడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఉన్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా నీళ్లు వాడని దద్దమ్మ ప్రభుత్వం మీది అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న లవ్ ఏంది?
వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో అర్థమవ్వట్లేదు.మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగితే, రెండ్రోజుల్లో కేంద్ర సంస్థల్ని పిలిపించాడు. మరి.. ఎస్ఎల్బీసీ మొత్తానికే కూలిపోతే, ఎన్డీఎస్ఏకి కిషన్ రెడ్డి లేఖ ఎందుకు రాయలేదు?
– మాజీ… pic.twitter.com/8cNNzhvCN0
— BRS Party (@BRSparty) July 2, 2025