హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాలో కూడా ఐటీని విస్తరించాలని.. జిల్లాలో ఐటీ టవర్లు( IT towers) నిర్మించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఐటీ టవర్లను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. ఈ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాల వల్ల చాలా కంపెనీలు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేటలో ఐటీ టవర్‌లో కూడా గతంలో 18 కంపెనీలు పనిచేస్తుంటే.. ఇప్పుడు 11 కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కనీసం ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఇంటర్నెట్ కూడా కట్ చేశారు. ఐటీ టవర్‌లో పని చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 4 నెలల నుండి జీతాలు ఇవ్వలేదన్నారు. అలాగే గతంలో వాళ్లకు మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కల్పించాము. ఇప్పుడు కూడా వాళ్లకు మరో మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలని కోరారు.