హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అప్పుల విషయంలో అబద్ధాలు చెప్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఎస్ఐఆర్ పై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేసిన అప్పు రూ. 1,77,058 కోట్లు అని మంత్రి జూపల్లి కృష్ణారావు నాకు లేఖ రాశాడు. కానీ రేవంత్ రెడ్డి నాలుగు నెలల క్రితం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,45,294 కోట్లు అని చెప్పాడు.
నాలుగు నెల కిందనే నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అంత చెప్పాడు అంటే ఈ నాలుగు నెలలది కూడా కలిపితే రూ. 4 లక్షల కోట్లు దాటుతుందన్నారు. జూపల్లి ఒక మాట చెబుతున్నాడు, రేవంత్ రెడ్డి ఇంకో మాట చెబుతున్నాడు. ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి? అని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేసిన అప్పు రూ. 1,77,058 కోట్లు అని జూపల్లి కృష్ణారావు నాకు లేఖ రాశాడు
కానీ రేవంత్ రెడ్డి 4 నెలల క్రితం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,45,294 కోట్లు అని చెప్పాడు
4 నెల కిందనే రేవంత్ రెడ్డి అంత చెప్పాడు అంటే ఈ 4 నెలలది కూడా… https://t.co/jUMm41ttDE pic.twitter.com/1K0h9Ns6vB
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2026