హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో హరీశ్‌కుమార్ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్ గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో కొనసాగుతూ.. ఇన్చార్జి డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయ న, పదవీ విరమణతో సంబం ధం లేకుండా పూర్తిస్థాయి డీజీపీగా రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ ఏడాది జనవరిలో ద్వార కా తిరుమలరావు డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత హరీశ్‌కుమార్ గుప్తాకే ఫిబ్రవరి ఒకటి నుంచి ఇన్చార్జిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన్ను పలువురు సీనియర్ పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మళ్లీ తెరపైకి జీఎస్టీ కుంభకోణం! ; రేపటి నుంచి సిట్ విచారణ ప్రారంభం
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం వాణిజ్య పన్నులశాఖలోని జీఎస్టీ స్కామ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. జీఎస్టీ చెల్లింపుల్లో భారీ కుంభకోణం జరిగిందనే అభియోగంపై నమోదైన కేసును విచారిస్తున్నది. 30 మంది వాణిజ్య పన్నులశాఖ అధికారులను ఈ నెల 3 నుంచి మూడు రోజులపాటు విచారించనున్నట్టు తెలిసింది. ఆ 30 మంది అధికారులకు మే 28 నుంచి విచారణకు రావాలని నోటీసులు జారీచేసినా.. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 3, 4, 5 తేదీల్లో విచారణకు రావాలని సీఐడీ సూచించింది. రూ.100 కోట్లు, అంతకన్నా ఎకువ వార్షిక టర్నోవర్ కలిగిన డీలర్ల పన్ను చెల్లింపులను పర్యవేక్షించిన అధికారులను సీఐడీ నేతృత్వంలోని సిట్ విచారించనున్నది. ఈ కేసులో రూ.1,400 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే కోణంలోనే అనుమానించి కేసు నమో దు చేసిన వాణిజ్య పన్నులశాఖ అధికారులు మొదటి విడత విచారణలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు.