హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మహిళా జర్నలిస్టులను వేధిస్తున్నవారిపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద హెచ్చరించారు. సోషల్ మీడియా బాధిత మహిళా జర్నలిస్టులు మంగళవారం రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించారు. సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా జరుగుతున్న దాడులపై ఉక్కుపాదం మోపాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు.