నీలగిరి, మార్చి 21: నల్లగొండ జనరల్ దవాఖానలో పారా మెడికల్ విద్యార్థినిపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన శనివారం ఆలస్యంగా తెలిసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పారామెడికల్ కళాశాల విద్యార్థిని కొన్ని నెలలుగా నల్లగొండ జనరల్ దవాఖానలో శిక్షణ తీసుకుంటున్నది. టెక్నిషియన్‌గా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
తనమాట వినకపోతే ఇంటర్న్‌షిప్‌లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని దవాఖాన ఆర్‌ఎంవోకు ఫి ర్యాదు చేయడంతో విచారణ కమిటీవేశా రు. సదరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నతాధికారులతో పైరవీ చేయిం చి కమిటీ నివేదిక బయటకు రాకుండాచేశాడు. దీంతో విద్యార్థిని డయల్ 100కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. సదరు టెక్నిషియన్ వల్ల గతంలోనూ నర్సింగ్ విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదురొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.