లక్ష్మణచాంద, మార్చి 23 : అధికారుల వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి(కే) గ్రామానికి చెందిన తొడిశెట్టి భూమన్న 30 ఏండ్ల క్రితం పూర్వ రా చాపూర్లోని వడ్యాల్ శివారులో ఐదెకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమి పొట్టపల్లి(కే)కి ఆనుకుని ఉంటుంది.
పొట్టపల్లి (కే) గ్రామానికి చెందిన భూమిని తొడిశెట్టి భూమన్న సాగు చేస్తున్నట్టు సదరు గ్రామస్థులు అనుమానించారు. ఈ విష యంలో అధికారులు సర్వే చేయాలని విన్నవించాడు. అంతేకాకుండా దీనిపై కోర్టులో కేసు వేశాడు. అప్పటి నుంచి అధికారుల వేధింపులు ఎక్కువ కా వడంతో ఆదివారం భీమన్న పురు గుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డాడు. కుటుంబ సభ్యులు దవా ఖా నకు తరలించి చికిత్స అందిస్తున్నారు.