హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైడ్రా బాధితులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు హరీశ్‌రావు ఇంటికి వచ్చి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో కన్నీరుమున్నీరైన తమకు హరీశ్‌రావు ధైర్యం చెప్పి భరోసా నింపారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆపదలో ఉన్న తమకు మానవతాధృక్పథంతో ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోమన్నారు. ప్రజాసమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఆయన మాలాంటి ఎందరికో ఆరాధ్యుడని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఎళ్లప్పుడూ ముందుండే ఆయనకు ఈ పండుగ వేళ మరింత సేవచేసే శక్తి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం హరీశ్‌రావు వారికి హోలీ శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి ఉన్నారు.