Hanumakonda | హనుమకొండ, జూన్ 06 : హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందారు. కాలికి గాయం కావడంతో కొన్నాళ్ల పాటు సెలవులో ఉన్నారు. కోలుకున్న అనంతరం ఇటీవలే మళ్లీ విధులో చేరారు. మృతి చెందిన శ్రీపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హనుమకొండలోని కుడా కాలనీలో నివాసం ఉంటున్నారు. విధుల్లో చేరిన ఆయన గత రెండు మూడు రోజుల నుంచి అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యను పరిష్కరించే దిశలో కృషి చేస్తున్నారు. అంతలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.