Hansika Nasanally | బంజారాహిల్స్, డిసెంబర్ 4 : అమెరికాలో నిర్వహించిన అందాల పోటీల్లో తెలంగాణకు చెందిన బాలిక సత్తా చాటింది. ‘నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్’ టైటిల్ను సాధించి రా ష్ర్టానికి వన్నె తెచ్చింది. మంగళవారం రాత్రి అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన నేషనల్ మిస్ అమెరికన్ పోటీ ల్లో తెలంగాణలోని వనపర్తికి చెందిన హన్సిక నసనల్లి (16) పాల్గొంది. అమెరికాలోని 50 రాష్ర్టాల నుంచి వచ్చిన 118 మంది బాలికలతో పోటీపడి మిస్ జూనియర్ టీన్ క్యాటగిరీలో విజేతగా నిలిచింది. అమెరికాలో స్థిరపడ్డ హన్సిక తండ్రి శేఖర్, భరతనాట్య కళాకారిణి అయిన తల్లి ప్రశాంతిని ప్రోత్సాహంతో హన్సిక పలు పోటీల్లో విజేతగా నిలిచింది.