హైదరాబాద్, అక్టోబరు 6 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల మేళా ‘సరస్’ను సెర్ప్ సీఈవో గౌతం పొట్రుతో కలిసి సీడీఎంఏ పమేలా సత్పతి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. నెక్లెస్ రోడ్లోని ప్రసాద్ ఐమాక్స్ పకన హెచ్ఎండీఏ మైదానంలో ప్రారంభమైన ఈ ప్రదర్శన ఈ నెల 16 వరకు ఉంటుంది.
19 రాష్ర్టాల్లోని మహిళలు తయారుచేసిన చేనేత, హస్తకళాకృతులు 300 స్టాళ్లలో అందుబాటులో ఉంచారు. రోజూ సాయంత్రం తెలంగాణ సాంసృతికశాఖ అధ్వర్యంలో సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు. ప్రవేశం ఉచితం. చేనేత, హస్తకళలు, వివిధ రకాల పిండివంటలు ప్రదర్శనకు ఉంచారు.