నల్లగొండ : నల్లగొండ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ చిలుకల గోవర్ధన్(74) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా పక్షవాతం, ఇతర అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఇదే సమయంలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. మొదట్లో కాంగ్రెస్ నేతగా, తర్వాత టీఆర్ఎస్ నేతగా ఉన్న గోవర్ధన్ మృతికి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నిబద్ధత గల నేతను కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డితో పాటు పలువురు మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.మృతదేహాన్నీ నల్లగొండలోని ఆయన కుటుంబానికి చెందిన నటరాజ్ థియేటర్ ఆవరణలో సందర్శన కోసం ఉంచారు.