Suryapet | గురుకుల బాలికల డిగ్రీ కళాశాల.. ప్రిన్సిపాల్ రూమ్‌లో బీరు బాటిళ్లు
సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుం చి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు.. శనివా రం ప్రిన్సిపాల్ రూమ్‌లో 4 బీరు బాటిళ్లు కనిపించడంతో ఆమె రూమ్‌కు తాళం వేసి నిరసన తెలిపారు.
- బాలెంల గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో వెలుగులోకి ఘటన
Suryapet | సూర్యాపేట రూరల్/సూర్యాపేట, జూలై 6: సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుం చి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు.. శనివా రం ప్రిన్సిపాల్ రూమ్‌లో 4 బీరు బాటిళ్లు కనిపించడంతో ఆమె రూమ్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ శైలజ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, భోజనం సరిగ్గా పెట్టడం లేదని, ప్రశ్నిస్తే చేయి చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని 4న సూర్యాపేట-జనగాం రహదారిపై విద్యార్థినులు బైఠాయించగా.. సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కో-ఆర్డినేటర్ అరుణకుమారి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.
తాజాగా ప్రిన్సిపల్ శైలజ తన చాంబర్లోనే కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి అర్ధరాత్రి వరకు మందు తాగుతారని, సమస్యలపై ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో వేణుమాధవరావు, ఆర్సీవో అరుణకుమారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఎస్పీ రవికుమార్, సీఐ రాజశేఖర్, రూరల్ ఎస్సై బాలునాయక్ కళాశాలకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. శైలజను సస్పెండ్ చేయడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ప్రిన్సిపల్ శైలజ వివరణ కోసం ‘నమస్తే తెలంగాణ’ యత్నించగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నది.
ఘటనపై మంత్రి ఉత్తమ్ సీరియస్
ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు కనిపించిన ఘటనపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణ జరిపించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌ను శనివారం ఫోన్లో ఆదేశించారు. దీంతో కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్ లత, సభ్యులుగా జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, ఆర్డీవో వేణుమాధవ్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి లతతో విచారణ కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

