ములుగురూరల్, ఆగస్టు 2: ములుగు జిల్లా బండారుపల్లి టీజీ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పదోతరగతికి చెందిన కార్తీక్, ప్రణయ్‌కి అస్వస్థతతో ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి, వరంగల్ ఎంజీఎకు రెఫర్ చేశారు. విద్యార్థులు పాము కాటుకు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి గూడెప్పాడ్లోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిసింది. అక్కడ వెంటిలేటర్లపై వైద్యం అందిస్తున్నట్టు తెలిసింది. ప్రిన్సిపాల్‌ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. విద్యార్థులను పాము కాటు వేసిందా? లేదా డ్రగ్స్ తీసుకొని అస్వస్థతకు గురయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.