వసతుల్లేవ్.. అడ్మిషన్లు ఇవ్వం!
వసతులు సక్రమంగా లేవనే సాకుతో ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో అకడమిక్ అధికారులు 12 కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టకూడదని నిర్ణయించారు.
- గురుకుల సొసైటీ నిర్వాకం
- 12 కాలేజీల ఎత్తివేత
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): వసతులు సక్రమంగా లేవనే సాకుతో ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో అకడమిక్ అధికారులు 12 కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టకూడదని నిర్ణయించారు. తల్లిదండ్రుల ఒత్తిడితో 5 కాలేజీల్లో ప్రవేశాలను కల్పించేందుకు సొసైటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మిగతా 7కాలేజీల్లో మాత్రం 2026-27 విద్యాసంవత్సరంలోనూ అడ్మిషన్లకు నిరాకరిస్తుండడం గమనార్హం. అందులో ప్రధానంగా చొప్పదండి, డోర్నకల్, మంథని, అందోల్లోని బాలికల, దుబ్బాక, అలంపూర్, జుక్కల్లోని బాలుర గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను కల్పించడం లేదు.
రిక్రూట్మెంట్కే జీవో 1274
బాలికల గురుకులాల్లో మహిళా సిబ్బందినే నియమించాలని జారీ చేసిన జీవో 1274 రిక్రూట్మెంట్ సందర్భంలోనే వర్తిస్తుందని ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వెర్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియామకాల వరకే జీవో పరిమితమన్నారు. కానీ అందుకు విరుద్ధంగా గతంలో బదిలీలను నిర్వహించారని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

