Gandhi Bhavan | గాంధీ భవన్‌ను ముట్టడించిన గురుకుల అభ్యర్థులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Gandhi Bhavan | గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ డిసెండింగ్ ఆర్డర్లో చేపట్టాలని గురుకుల అభ్యర్థులు బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంతో పాటు పెద్దమ్మ గుడి వద్ద భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ్నుంచి నాంపల్లిలోని గాంధీ భవన్‌కు చేరుకున్నారు.
Gandhi Bhavan | హైదరాబాద్ : గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ డిసెండింగ్ ఆర్డర్లో చేపట్టాలని గురుకుల అభ్యర్థులు బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంతో పాటు పెద్దమ్మ గుడి వద్ద భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ్నుంచి నాంపల్లిలోని గాంధీ భవన్‌కు చేరుకున్నారు. డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాల భర్తీ చేపట్టి, తమకు న్యాయం చేయాలని గాంధీ భవన్ గేటు వద్ద నిరసనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీ భవన్‌ను ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న గురుకుల అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం అని హరీశ్‌రావు అన్నారు.
మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయమని హరీశ్‌రావు పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అత్యున్నత, నాణ్యమైన రెసిడెన్షియల్‌తో కూడిన విద్యను పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసింది అని మాజీ మంత్రి గుర్తు చేశారు.
గాంధీ భవన్ ముట్టడించిన గురుకుల అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన తెలపడానికి అనుమతించకపోవడంతో, పెద్దమ్మ గుడి దగ్గర ఆందోళన చేయగా అక్కడి నుండి సైతం వెళ్లగొట్టడంతో వారు గాంధీ భవన్ ముట్టడించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న… pic.twitter.com/WZ0D1jxa1N
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

