Gurukula Results | హైదరాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న నిర్వహించిన ప్రవేశపరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేసినట్టు టీజీసెట్-2025 చీఫ్ కన్వీనర్ అలుగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓసీ క్యాటగిరీలకు చెందిన 36,334 మందికి సీట్లు లభించాయని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు 89,246 మంది దరఖాస్తు చేసుకోగా, 84,672 మంది పరీక్షకు హాజరైనట్టు ఆమె తెలిపారు. 5వ తరగతిలో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఇదివరకే ప్రత్యేక క్యాటగిరీ కింద 1944 సీట్లను భర్తీ చేశామని, మిగిలిన 13,130 సీట్లను వివిధ క్యాటగిరీల నుంచి దశలవారీగా భర్తీ చేస్తామని ఆమె వివరించారు.