గోల్నాక, అక్టోబర్ 6: వాట్సాప్ డీపీలో అందమైన ఫొటోపెట్టిన ఓ లేడీ గుంటూరుకు చెందిన వ్యాపారిని 1.20 కోట్లకు మోసం చేసింది. వచ్చిన డబ్బుతో ప్రియుడు, బావతో కలిసి గోవాలో ఎంజాయ్ చేసింది. బాధితుడి ఫిర్యాదుతో కటకటాల పాలైంది. హైదరాబాద్లోని అంబర్పేట డీడీ కాలనీకి చెందిన అర్చన (24) స్థానికంగా బ్యూటీపార్లర్ నడుపుతున్నది. అదే ప్రాంతంలో ఉండే బావ సాయిరాంతో కలిసి అతడి స్నేహితుడైన గుంటూరుకు చెందిన వ్యాపారి సుబ్బారెడ్డిని మోసం చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. వాట్సాప్ డీపీలో అందమైన ఫొటోపెట్టి.. సుబ్బారెడ్డికి ఫోన్ చేసింది. పరిచయం పెరిగాక బ్యూటీపార్లర్ అభివృద్ధి కోసం రూ.లక్ష అప్పుగా తీసుకున్నది. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని చెప్తూ విడుతలవారీగా రూ.కోటి 20 లక్షలు కాజేసింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సుబ్బారెడ్డి అంబర్పేట పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అర్చన, ఆమె బావ, ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారివద్ద గల 11 తులాల బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నారు.