కొత్తగూడెం అర్బన్/ అశ్వారావుపేట రూరల్, సెప్టెంబర్ 26 : ఏళ్లతరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అప్పగించాలని, వారిపై అటవీ శాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములు తమకే అప్పగించాలని కోరుతూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి.
దీక్షా శిబిరాన్ని గుమ్మడి నర్సయ్య, మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు కెచ్చల రంగారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ వారికి న్యాయం చేయాలని కోరారు.