హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామకానికి ప్రభుత్వం బుధవారం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10,954 పోస్టులకుగానూ ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. డిగ్రీ చేసిన వారు లేదా ఇంటర్ విద్యార్హతతో వీఆర్వోలుగా ఐదేళ్ల సర్వీసు ఉన్నవారు లేదా వీఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీసులో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారు అర్హులు అని తెలిపింది. తొలి ప్రాధాన్యంగా పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకే అవకాశం ఇవ్వనున్నారు. ఆసక్తి గల వీఆర్వో, వీఆర్ఏలు ఆన్లైన్లో (https:// forms.gle/AL3S8r9E2Dooz9Rc7) దరఖాస్తు చేసుకోవాలని లేదా దరఖాస్తులను కలెక్టరేట్లో అందజేయాలని సూచించింది.