డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు 50 వేల వేతనం ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ.50 వేల చొప్పున వేతనం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు.
- ఆటో రెన్యువల్‌తో కొనసాగించాలి
- పార్ట్‌టైమ్ లెక్చరర్లుగా పేరు మార్చాలి
- గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్
- సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లే యత్నం
- పోలీసుల అడ్డగింత.. సీఎస్‌తో చర్చలు
హైదరబాద్ జూలై 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ.50 వేల చొప్పున వేతనం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఆటో రెన్యువల్‌ను వర్తింపజేయాలని కోరారు. గెస్ట్లెక్చ రర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే అవకాశం ఇవ్వాల ని సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్ర యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక్క డ నేతలు మాట్లాడుతూ 12 ఏండ్లుగా పనిచేస్తున్న తమకు రెన్యువల్ విషయంలో కొత్తగా డెమో నిబంధన విధించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 145 ప్రభుత్వ కళాశాలల్లో 1,600 మంది పనిచేస్తున్న తెలిపారు. పీరియడ్ విధానాన్ని రద్దుచేసి 12 నెలలకు కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలని కోరారు.
గెస్ట్ లెక్చరర్లు అన్న పదాన్ని తొలగించి పార్ట్‌టైమ్ లెక్చరర్లుగా మార్చాలని, బదిలీ అయినవారి ని రీలొకేట్ చేయాలని డిమాండ్ చేశారు. వి ద్యాశాఖకు మంత్రి లేకపోవడం దౌర్భగ్యమ ని, సమస్యలపై మంత్రులకు వినతిపత్రాలు ఇస్తే చెత్తబుట్టల్లో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో అసోసియేషన్ ప్రతినిధులు చర్చలకు వెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

