నేడు ‘తెరసం’ పుష్కర సభలు
తెలంగాణ అస్తిత్వ చైతన్య పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రచయితల సంఘం (తెరసం) పుష్కర సభలు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగనున్నాయి.
- హాజరు కానున్న సాహితీవేత్తలు
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వ చైతన్య పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రచయితల సంఘం (తెరసం) పుష్కర సభలు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగనున్నాయి. ఈ సభలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయని తెరసం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, జంట నగరాల ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ సంపత్ అధ్యక్షతన జరుగనున్న రెండు ప్రసంగ కార్యక్రమాల్లో సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్, ఎన్ వేణుగోపాల్, ప్రొఫెసర్ బన్న పున్నయ్య వక్తలుగా పాల్గొనున్నారని తెలిపింది.
సభల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, రచయిత్రి కొండపల్లి నీహారిణి అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో 2014 మే 21న ఏర్పడిన తెరసం ఎన్నో ఉద్యమ సదస్సులు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపింది. విభిన్న సాహిత్య ప్రక్రియల్లో నిపుణులైన వక్తలతో ప్రసంగాలు, కార్యశాలలు ఏర్పాటు చేసిందని, 40కి పైగా పుస్తకాలను ఆవిష్కరించిందని వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

