హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ శ్లాబులు తగ్గించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. ఆదివారం సీపీఐ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీహార్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడంతోనే దిద్దుబాటు చర్యలు చేపట్టిందని విమర్శించారు. ఇందులో భాగమే జీఎస్టీ తగ్గింపు నాటకమని పేర్కొన్నారు.