హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గ్రామ్ రోజ్‌గార్ సేవక్ (జీఆర్ఎస్) ఆన్లైన్ కోర్సును కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో మంగళవారం జరిగిన జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ 66వ జనరల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. న్యూఢిల్లీకి చెందిన జేఎన్‌యూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ), పీహెచ్డికి సంబంధించి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. రూరల్ టెక్నాలజీ పారును సందర్శించి పీఎంఏవై-జీ మోడల్ హౌస్‌ను ప్రారంభించారు. అనంతరం మొకలు నాటారు. పార్లోని మడ్బ్లాక్ తయారీ యూనిట్‌ను సందర్శించారు.