హైదరాబాద్, మార్చి 9 ( నమస్తే తెలంగాణ ) : కొవిడ్ తర్వాత పెంపుడు జంతువులను పెంచుకునేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్నారు. వాటి కొనుగోలుకు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. దీంతో వాటి పరిరక్షణకు పెంపుడు జంతువుల వైద్యులకు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. వాటి సంరక్షణకు నగరాలు, పట్టణాల్లో పెట్ క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు రద్దీగా మారుతున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ తీసుకున్న పెట్ క్లినిక్లు రాష్ట్రవ్యాప్తంగా 1,012 నడుస్తున్నాయి. ఒక హైదరాబాద్ నగరంలోనే 390 వరకు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,440 మంది పశువైద్యులుగా రిజిస్టర్ వీరిలో సగానికిపైగా ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తుండగా, మిగతా వారు ప్రైవేటు క్లినిక్లలో పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల వరకు వీధికుకలు, 1.20 లక్షల వరకు పిల్లులు వీటిలో 3.20 లక్షల పెట్ 32 వేల పిల్లులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 10,500 పెంపుడు కుకలు నమోదై ఉండగా, రిజిస్టర్ 42 వేలు ఉన్నాయి.