హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధమయ్యింది. ఆది, సోమవారాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు అరగంట ముందుగానే పరీక్షాకేంద్రాల గేట్లు మూసేస్తారు. ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే వారు ఒరిజినల్ ఐడీతోపాటు బ్లూ లేదా బ్లాక్ కలర్ పెన్నును వెంట తీసుకెళ్లాలి.