హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ షెడ్యూల్లో హాజరుకాలేని వారి కోసం జూలై 9న రిజర్వ్‌డేగా ప్రకటించారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీ ప్రాంగణంలో వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 1,388 పోస్టుల భర్తీకి గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేయగా, రాత పరీక్షను నిర్వహించి జీఆర్‌ఎల్‌ను సైతం ప్రకటించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్, వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. 17 నుంచి జూలై 9 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని కమిషన్ తెలిపింది.
16న గ్రూప్-1 సర్టిఫికెట్ వెరిఫికేషన్
గ్రూప్-1 పోస్టుల భర్తీలో భాగంగా మరికొందరు అభ్యర్థులకు ఈ నెల 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇప్పటికే రెండు విడతల వెరిఫికేషన్ ముగియగా, మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని కమిషన్ వెల్లడించింది. హాజరుకాలేని వారి కోసం ఈ నెల 17న రిజర్వుడేగా ప్రకటించారు. వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని నవీన్ తెలిపారు.