హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-3 పరీక్షల ప్రాథమిక ‘కీ‘ని టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. నవంబర్ 17, 18 న మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, తాజాగా మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 12 సాయంత్రం 5గంటల వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు.
నేడు సీడీపీవో ప్రాథమిక కీ..
మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ గురువారం విడుదల కానుంది. ప్రాథమిక ‘కీ’పై ఈ నెల 11లోపు అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు. 3, 4న పరీక్షలు నిర్వహించగా, రెస్పాన్స్ షీట్లతోపాటు ప్రాథమిక ‘కీ’ని సైతం వెబ్సైట్లో పొందుపరిచారు.
టీపీబీవో ఫలితాల విడుదల
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలను టీజీఎస్సీ ప్రకటించింది. మొత్తం 171 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది. జాబితా కోసం https:/ /www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.