Group-2 Results | కోదాడ, మార్చి 11 : గ్రూప్-2 ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి కోదాడ వాసి. హర్షవర్ధన్ తండ్రి రమణారెడ్డి కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు. 447.088 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ ర్యాంకు సాధించిన హర్షవర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
హర్షవర్ధన్ రెడ్డి ఏడో తరగతి వరకు ఖమ్మం కేంద్రీయ విద్యాలయంలో, 8 నుంచి 10వ తరగతి వరకు విజయవాడ నలంద విద్యాలయంలో, ఆ తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలో, బీటెక్ తాడేపల్లిగూడెం నిట్‌లో చదివారు. ఎటువంటి కోచింగ్ లేకుండా ప్రణాళిక బద్ధంగా చదవటం వల్లే తాను ఈ ర్యాంకు సాధించినట్టు హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డిని జూనియర్ కళాశాల అధ్యాపకులు అభినందించారు. క్రమశిక్షణతో పట్టుదలతో చదవడం వల్లే ర్యాంకు సాధించారని కొనియాడారు. అభినందించిన వారిలో అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, పిచ్చిరెడ్డి, యాదగిరి, భీమారావు, రత్నకుమారి, రమేష్ బాబు, జి నాగరాజు, గోపికృష్ణ, చంద్రశేఖర్, మమత, డిఎస్ రావులు ఉన్నారు.