హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూ ప్-2 పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. డిసెంబర్ 15,16 తేదీల్లో పరీక్షలు నిర్వహించన్నది. ఈ మేరకు గురువారం టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వివరాలు వెల్లడించారు. సుమారు 5.51 లక్షల మంది పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు పేపర్-4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు. డిసెంబర్ 9 నుంచి హాల్టికెట్లు టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. ఏమైనా సమస్యలు ఎదురైతే 040-23542185, 23542187 నంబర్లలో ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించాలని సూచించారు.