హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 26 లేదా 27 తేదీల్లో (సోమ లేదా మంగళవారం) గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు చేస్తున్నది. అదేరోజు పరీ క్ష రాసిన 2,33,248 మంది అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను కమిషన్ వెబ్సైట్లో పెట్టేందు కు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు 3 నుంచి 5 రోజులు సమ యమిచ్చే అవకాశం ఉన్నది. వచ్చిన అభ్యంతరాల అనంతరం జూలై మొదటి వారంలోనే మెయిన్ లిస్టును విడుదల చేయనున్నట్టు కమిషన్వర్గాలు తెలిపాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీ, పరీక్ష ఫలితాలు, మెయిన్ పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై శుక్రవారం కమిషన్ చర్చించింది. శనివారమే ప్రిలిమ్స్ కీ ఇ వ్వాలని నిర్ణయించింది. పలు సాంకేతిక కారణాలతో కీని ఒకటికి రెండుసార్లు పునఃపరిశీలించాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది.