జడ్చర్ల/కాశీబుగ్గ, జనవరి 27: మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి, వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లలో పల్లికాయకు రికార్డు స్థాయి ధరలు పలికాయి. మంగళవారం బాదేపల్లి మార్కెట్కు 2,080 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా క్వింటాకు రూ.12,751 ధర పలికింది.
మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధికం. వరంగల్ ఎనుమాముల మా ర్కెట్ చరిత్రలోనే అత్యధికంగా క్విం టా ఎండు పల్లికి రూ.12,020 ధర పలికినట్టు అధికారులు తెలిపారు.