మున్నూరుకాపులు ఐక్యతతో సాగాలి
రాజ్యాధికారంలో సముచిత వాటా, న్యాయమైన హకుల సాధనకు మున్నూరుకాపులందరూ ఐక్యతతో సాగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
- రాజ్యాధికారంలో సముచిత వాటానే ధ్యేయం
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాజ్యాధికారంలో సముచిత వాటా, న్యాయమైన హకుల సాధనకు మున్నూరుకాపులందరూ ఐక్యతతో సాగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. బీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు హైదరాబాద్ కోకాపేటలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపు భవన నిర్మాణానికి ఐదెకరాలను కేటాయించారు. ఆ స్థలంలో మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన (మున్నూరు కాపు టవర్స్) నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తమరావు నేతృత్వంలో కొనసాగిన పూజా కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. మున్నూరుకాపులు పట్వారీలు, పోలీస్ పటేల్స్, మాలీపటేల్స్గా సమాజానికి విశేష సేవలందించారని వివరించారు. ఆత్మగౌరవ భవన టవర్స్‌కు భూరి విరాళాలు అందజేయాలని దేశ, విదేశాల్లోని కులబాంధవులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సంఘ ప్రముఖులు గాలి అనిల్‌కుమార్, తూడి ప్రవీణ్ రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించారు. బిల్డర్ పోతురెడ్డి రమేశ్‌బాబు, ఆయన కుమారుడు సందీప్, సంఘ ప్రముఖులు సల్ల కృష్ణ, ఆకుల సత్యనారాయణ, మిరియాల రాఘవరావును ఎంపీ సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది, కోశాధికారి కంచి, కనకయ్య, రమేశ్ , మల్లేశ్, లక్ష్మణ్, విష్ణువర్ధన్, పెంటయ్య, సత్యనారాయణ, పద్మక, పటేల్, లవంగాల అనిల్, ఊసా రఘు, బేతి శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

