సిద్దిపేట, డిసెంబర్ 17: తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను ప్రైవేట్‌కు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర లు చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయాలని చూస్తున్న దని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయ న సిద్దిపేటలో జరిగిన ఉమ్మడి మెదక్ సీపీఐ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో మాట్లాడారు. ప్రభు త్వ సంస్థలను ఉద్దేశ పూర్వకం గా ప్రైవేటు, కార్పొరేట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తన తీరు మార్చుకోకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ పోరాడాలని కోరారు.