మార్కెట్ ధరలతో పోల్చవద్దు..
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ఫుడ్ ప్రొవిజన్ (కిరాణా సామగ్రి) వస్తువుల్లో 200 కోట్ల గోల్మాల్ జరిగిందనేది అబద్ధమని టెండర్లను పర్యవేక్షిస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ వెల్లడించింది.
- కిరాణా ప్రొవిజన్ ఖరారు కాలేదు
- టెండర్లపై అధికారుల స్పందన
హైదరాబాద్, జూన్15 (నమస్తే తెలంగాణ): గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ఫుడ్ ప్రొవిజన్ (కిరాణా సామగ్రి) వస్తువుల్లో 200 కోట్ల గోల్మాల్ జరిగిందనేది అబద్ధమని టెండర్లను పర్యవేక్షిస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు పీఎంయూ చైర్మన్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫుడ్ప్రొవిజన్ టెండర్లలో గోల్మాల్ అంటూ ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై పీఎంయూ చైర్మన్ స్పందించారు. ఇప్పటికీ ఫుడ్ ప్రొవిజన్ టెండర్‌ను ఖరారు చేయలేదని తెలిపారు. దాఖలైన బిడ్ల పరిశీలన కొనసాగుతున్నదని, ఇప్పటికీ ఫుడ్ ప్రొవిజన్ వస్తువుల ధరలను ఖరారు చేయలేదని వివరించారు. అదీగాక అన్ని ఖర్చులతో కూడిన, ఇంటి వద్దకే డెలివరీ చేసే సంస్థాగత ధరలను మారెట్ ధరతో పోల్చడం సరికాదని వివరించారు. టెండర్ ధరల్లోనే మారుమూల గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు సహా, 33జిల్లాలో విస్తరించిన 3వేలకు పైగా సంస్థలకు జీఎస్టీ, రవాణా, లోడింగ్/అన్ లోడింగ్, డోర్-డెలివరీ చార్జీలు అన్ని కలిపి ఉంటాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

