Srsp | ఎస్సారెస్పీని సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్
Srsp | నీటిపారుదల శాఖ అధికారులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎస్సారెస్పీ అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమాన్ని, ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నిజామాబాద్ : నీటిపారుదల శాఖ అధికారులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎస్సారెస్పీ అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమాన్ని, ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వదర ఉధృతంగా వచ్చే సమయంలో ఎగువ, దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంతాల పరిస్థితిపై సమీక్షించారు. ప్రాజెక్ట్ నీటివినియోగంలో ఉన్న సాంకేతిక, ఇతర సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో వారు నివేదికను తయారు చేస్తామన్నారు.
కాలువలతో అనుసంధానంగా ఉన్న ఎత్తి పోతల పథకాల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. సింగూరు, నిజాంసాగర్, అలీసాగర్, ఎస్సారెస్పీ, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుపైకి వెళ్లి వరద గేట్లను కాకతీయ, సరస్వతీ, వరద, లక్ష్మీ కాలువలను పరిశీలించారు.
ఆయన వెంట వైస్ చైర్మన్ కుటియాల్ ఎస్సారెస్పీ, నిజమాబాద్ చీఫ్ ఇంజినీర్లు సుధాకర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, ఎస్ఈ జి.శ్రీనివాస్, ఈఈలు సి.పద్మిని, చక్రపాణి, కరుణాకర్, శంకర్, డీఈ నరేశ్, గణేవ్, ఏఈఈ అక్తర్, మాధవి, సారిక, వంశీ, రవి, రామారావు తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

