Green India Challenge : ప్రస్తుతం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఊపందుకుంది. మొక్కలను నాటడాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ బర్త్ డే రోజున ముక్కోటి వృక్షార్చన అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించి కోట్లాది మొక్కలను ప్రతి ఒక్కరు నాటి హరితహారం స్ఫూర్తిని అందరిలో నింపారు. అలాగే.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గొప్ప చాలెంజ్.. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా.. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ మొక్కలు నాటుతున్నారు.
నిజం చెప్పాలంటే గ్రీన్ ఇండియా చాలెంజ్, హరితహారం అనే కార్యక్రమాలు ఎప్పుడైతే మొదలయ్యాయో.. అప్పుడే చెట్ల గురించి, వాటి విలువ గురించి తెలిసింది. అందుకే.. ప్రతి ఒక్కరు ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు. వాటిని పరిరక్షిస్తున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకున్న కరీనంగర్ జిల్లా చింతకుంట గ్రామ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ సరికొత్త ఆలోచన చేశారు.
పెద్దలకు, యువతకు అంటే చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తాయి కానీ.. చిన్న పిల్లలకు, విద్యార్థులకు చెట్ల విలువ ఎలా తెలియాలి? అందుకే.. ఆయన స్కూల్ ఆవరణలో ఉన్న చెట్లకు బోర్డులను తగిలించి.. ఆ చెట్ల వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో ఆ బోర్డు మీద రాశాడు.
ఒక చెట్టు కొమ్మకు తండ్రినై రక్షిస్తాను అనే బోర్డును వేలాడదీశాడు. మరో బోర్డుకు నీ యంత్రానికి ఇందనమౌతా, చల్లని నీడనిస్తాను, కవులకు కల్పవల్లినౌతా, నీ రోగానికి ఔషదాన్ని అవుతా, పండ్లను ఇస్తాను, వర్షం కురిపిస్తాను, మీ పంటకు ఎరువును అవుతా, తల్లినై పాలిస్తాను, ప్రకృతికి ప్రాణమవుతా.. అంటూ ఇలా స్కూల్ ఆవరణలో ఉన్న అన్ని చెట్లకు ఇలా బోర్డులు ఏర్పాటు చేయించి.. వాటి విలువను విద్యార్థులకు తెలిసేలా చేస్తున్నారు.
విద్యార్థులకు చెట్ల విలువ తెలియాలంటే, వాటి గొప్పదనం తెలియాలంటే.. ఇంతకన్నా బెటర్ ఐడియా ఉంటుందా? తన పరిధి దాటి ఆలోచించి.. చెట్ల గొప్పదనాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చాటి చెబుతున్న కరీంనగర్ జిల్లా చింతకుంట జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ భూమా రెడ్డిని అభినందిస్తున్నా.. అంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వావ్.. సూపర్.. ఇలా చెట్ల గొప్పదానాన్ని పిల్లలకు వివరిస్తే.. భవిష్యత్తులో వాళ్లు చెట్లను ఖచ్చితంగా పరిరక్షిస్తారు. ఈ వీడియో చూసిన వాళ్లకు ఖచ్చితంగా మొక్కలు నాటి వాటిని పెంచి పెద్ద చేయాలని అనిపిస్తుంది.. అంటూ రిప్లయి ఇస్తున్నారు.
The perfect way of instilling the uses of a tree into brains of the students. Appreciate headmaster Sri Bhoom Reddy garu, ZPHS, Chintakunta, Karimnagar for his out of the box thinking to encourage young minds towards taking care of the environment.#GreenIndiaChallenge🌱 pic.twitter.com/33rlJggTXp
— Santosh Kumar J (@MPsantoshtrs) August 3, 2021