లండన్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్
రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన, అకడి నగరాల మేయర్లను కలవడంతోపాటు వారితో కలిసి మొకలు నాటారు.
- మొకలు నాటిన బ్రిటన్ మేయర్లు
- జీఐసీ వ్యవస్థాపకుడు సంతోష్ హర్షం
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేశారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన, అకడి నగరాల మేయర్లను కలవడంతోపాటు వారితో కలిసి మొకలు నాటారు. ఈ విషయాన్ని ఆయన శనివారం ఎక్స్ వేదికగా ద్వారా పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. హెర్ట్స్మేర్ మేయర్ పర్వీన్ రాణి, ఎల్స్ట్రీ బోర్హామ్వుడ్ మేయర్ తుషార్కుమార్ను కలవడం తనకు దకిన గౌరవంగా పేర్కొన్నారు.
సమాజ సేవలో అంకితభావం, స్పష్టమైన విజన్‌తో దూసుకుపోతున్న ఈ ఇద్దరూ తల్లీకొడుకులు కావడం విశేషమని తెలిపారు. ఈ భేటీ సందర్భంగా వారందరూ కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఒక మొకను నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా అందరికీ సమాన బాధ్యత ఉన్నదని సంతోష్ పేర్కొన్నారు.
ప్రజలందరినీ కలుపుకుంటూ సాగే వారి ప్రజారంజక పాలనాతీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నదని ప్రశంసించారు. ఈ సమావేశంలో పౌర నాయకత్వం, యువత భాగస్వామ్యం, పర్యావరణ నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ఈ స్నేహపూర్వక బంధం రాబోయే రోజుల్లో భారత్-బ్రిటన్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

