హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హరిత భారత్ సాధనే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ అసోంలో మొదలుపెట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొకలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండి యా చాలెంజ్ పనిచేస్తున్నది. ప్రధాని నరేం ద్ర మోదీ జన్మదినం సందర్భంగా నగాన్ జి ల్లా పామ్గోన్ గ్రామంలో ఒకేచోట 74 మొ కలను నాటారు.
పద్మశ్రీ, ఫారెస్ట్ మ్యాన్ ఆ ఫ్ ఇండియాగా పేరొందిన జాదవ్ పయంగ్ స్ఫూర్తితో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన కోటి మొకల కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని అస్సామీలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు క్రమంగా రుతువుల మార్పులకు కూడా కారణమవుతున్నాయని సంతోష్‌కుమార్ చెప్పా రు.
పెద్ద సంఖ్యలో మొకలు నాటి, సంరక్షిస్తే పర్యావరణ మార్పులను అడ్డుకోవచ్చని, ఇందుకోసం స్థానికుల మద్దతు తీసుకుంటామని తెలిపారు. అసోంలో ఏప్రిల్‌లో ఈ కా ర్యక్రమాన్ని మొదలు పెట్టామని, ఇప్పటిదా కా రెండున్నర లక్షల మొకలు నాటామని ఇగ్నైటింగ్ సంస్థ వ్యవస్థాపకుడు కరుణాకర్ తెలిపారు. ఈ మొక్కలను జియోట్యాగ్ చేసి నట్లు చెప్పారు. కార్యక్రమంలో రీతురాజ్, రోసీదేవి, వలంటీర్లు పాల్గొన్నారు.