హైదరాబాద్ జూన్ 5 (నమస్తేతెలంగాణ): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మూడు మొక్కలు నాటారు.
అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ హీరో చిరంజీవి, పద్మశ్రీ అవార్డీ జాదవ్ పయాంగ్కు మొక్కలు నాటాలని చాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.