హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): దేశాన్ని హరితమయంగా మార్చే గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం భువనేశ్వర్‌లోని ఐఆర్సీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూళ్లలో ఒడిశా అసెంబ్లీ స్పీకర్ సురమా పాధి చేతలు మీదుగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఏడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘హర హైతో భారా హై- గ్రీన్ ఇండియా చాలెంజ్’ (భూమి పచ్చగా ఉంటే లోకం నిండుగా ఉంటుంది) కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలను కోరారు. భూమి ని చల్లగా ఉంచేందుకు, జీవజాతులను కాపాడేందుకు అందరం మొక్కలు నాటుదామని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రీన్ హీరోగా మారాలని కోరారు.