హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు స్వ ల్పంగా పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత కొనసాగుతున్నది.
తెల్లవారుజాము నుంచి ఉదయం 8గంటల వరకు దట్టమైన పొగమంచు ఏర్పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.